Indians: అమెరికా నుంచి 682 మంది భారతీయుల బహిష్కరణ 7 d ago

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి వచ్చిన భారతీయులను స్వదేశాలకు పంపిస్తున్నారు. జనవరి నుండి 682 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు. బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న భారతీయులకు మద్దతుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.